Pune: ఆడపిల్ల పుట్టింది.. అందుకే సంతోషంతో హెలికాప్టర్‌లో..

Pune: ఆడపిల్ల పుట్టింది.. అందుకే సంతోషంతో హెలికాప్టర్‌లో..
X
Pune: పుణెలో నివాసముంటున్న విశాల్ జరేకర్‌కు జనవరి 22న ఆడపిల్ల పుట్టింది.

Pune: ట్రెండ్ ఎంత మారుతున్నా.. మనుషుల ఆలోచనా విధానం ఎంత మారుతున్నా.. ఇంకా ఆడపిల్ల పుడితే సంతోషించని కుటుంబాలు ఉన్నాయి. మగపిల్లాడే కావాలనే కోరుకునే మనుషులు ఉన్నారు. కానీ వారందరి మధ్యలో ఆడపిల్లను అదృష్టంగా భావించేవారు కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. తాజాగా పుణెలో ఆడపిల్ల పుట్టిందని సంతోషంతో తల్లిదండ్రులు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

పుణెలో నివాసముంటున్న విశాల్ జరేకర్‌కు జనవరి 22న ఆడపిల్ల పుట్టింది. తనకు రాజలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. కూతురు పుట్టిన తర్వాత విశాల్ భార్య ఇన్నిరోజులు తన తల్లిదండ్రులతోనే ఉంది. ఇక అత్తగారింటికి కూతురిని తీసుకెళ్లాల్సిన సమయం రాగానే విశాల్.. తన కూతురి కోసం హెలికాప్టర్‌ను బుక్ చేశాడు. ఈ వార్త పుణెలోనే కాదు.. దేశవ్యాప్తంగా తెగ వైరల్ అయ్యింది.

ఈ సందర్భంగా విశాల్ తన సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు. తమ కుటుంబం మొత్తంలో ఇప్పటివరకు ఆడపిల్లలు లేరన్నాడు విశాల్. అందుకే తన కూతురు హోమ్ కమింగ్‌ను స్పెషల్‌గా ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నాడట. హెలికాప్టర్ బుక్ చేయడానికి రూ. లక్ష ఖర్చుపెట్టానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Tags

Next Story