UP : భార్య చంపుతుందని భయం.. ప్రియుడితోనే ఉండడానికి భర్త గ్రీన్ సిగ్నల్..

UP : భార్య చంపుతుందని భయం.. ప్రియుడితోనే ఉండడానికి భర్త గ్రీన్ సిగ్నల్..
X

ఇటీవల భార్యలు భర్తలను చంపడం ఆందోళన కలిగిస్తుంది. పెళ్లాయ్యక ప్రియుడి కోసం భర్తను చంపి జైళ్లపాలవుతున్నారు. పెళ్లై 15రోజులు కూడా కాకముందే భర్తలను కడతేరుస్తున్నారు. గత కొంతకాలంగా ఇదొక ట్రెండ్‌గా మారింది. దీంతో భర్తలు చంపేస్తారేమోనని భార్యలకు భయపడుతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కేరి జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పర్సాముర్తా గ్రామానికి చెందిన రామ్‌చరణ్‌కు 20ఏళ్లి క్రితం జానకీదేవితో పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. రామ్‌చరణ్‌ ముంబయిలో టైల్స్‌ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. జానకి ఇంటి వద్దే ఉంటూ పిల్లల్ని చూసుకుంటుంది.

నాలుగేళ్ల క్రితం జానకికి.. సోను ప్రజాపతి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఏకంగా ఏడు నెలలు వారిద్దరూ ఒకే ఇంట్లోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న రామ్‌చరణ్‌ భార్యని నిలదీయగా క్షమాపణ చెప్పి భర్తతోనే కలిసి ఉంది. కొన్ని నెలల తర్వాత మళ్లీ ప్రియుడి దగ్గరికే వెళ్లింది. ఈ క్రమంలో జానకి కనిపించడం లేదంటూ పోలీసులకు రామ్ చరణ్ ఫిర్యాదుచేశాడు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ నెల 20న ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. ప్రియుడు సోనుతో తన భార్య ఉండటం తనకు ఇష్టమేనని.. ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ లెటర్ రాసి పోలీసులకు ఇచ్చాడు. గతంలో ఇలాగే చేసి తిరిగి వస్తే క్షమించాను కానీ ఇప్పుడు క్షమించేది లేదన్నాడు. పైగా ఎక్కడా తనను చంపేస్తుందోనని భయంగా ఉందని పోలీసులకు తెలిపాడు.

Tags

Next Story