Gitaben Rabari: పాట పాడింది.. ఉక్రెయిన్‌కు రూ.2.25 కోట్ల విరాళం ఇచ్చింది..

Gitaben Rabari: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలయ్యి నెల దాటింది. ఇప్పటికీ రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తూ.. ఆ దేశంపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తోంది. మేలో యుద్ధం ముగియనుంది అని వార్తలు వచ్చినా.. అప్పటికీ ఉక్రెయిన్ భారీ సంక్షోభంలో చిక్కుకుపోయే అవకాశం ఉంది. ఇప్పటికే యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉక్రెయిన్ ప్రజల కోసం ఏకంగా రూ. 2 కోట్లు విరాళాలను సేకరించి ఓ గుజరాత్ సింగర్.
ఉక్రెయిన్‌కు సహాయం చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఫారిన్‌లో ఉన్న ఎన్‌ఆర్ఐలు కూడా వారికి తోచినంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. జార్జియాలోని అట్లాంటాలో గుజరాతి ఎన్‌ఆర్ఐలు అందరూ ఉక్రెయిన్‌కు సహాయపడడం కోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో గుజరాతి సింగర్ గీత బెన్ రబారి పాట పాడి అందరినీ అలరించింది.
లోక్ ధాయిరో పేరుతో నిర్వహించిన ఈ మ్యూజికల్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. అక్కడికి వచ్చిన వారంతా గీతా బెన్ గాత్రానికి ఇంప్రెస్ అవ్వడంతో పాటు ఉక్రెయిన్‌కు సహాయపడాలన్న ఉద్దేశ్యంతో డాలర్ల వర్షం కురిపించారు. దీని ద్వారా వారు మొత్తంగా 300,000 డాలర్ల విరాళాన్ని సేకరించగలిగారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.2.25 కోట్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com