Sangareddy District : ఒకేసారి ఐదు పిల్లలకు జన్మనిచ్చిన మేక.. సంగారెడ్డి జిల్లాలో ఘటన

Sangareddy District : ఒకేసారి ఐదు పిల్లలకు జన్మనిచ్చిన మేక.. సంగారెడ్డి జిల్లాలో ఘటన
X

మామూలుగా ఏ పశువైన రెండు లేదా మూడు పిల్లలకు జన్మనిస్తుంది. కానీ ఓ మేక ఒకేసారి ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని బొబ్బిలిగామలో జరిగింది. మేకల కాపరి రాజుకు చెందిన మేక ఒకే కాన్పులో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నాలుగు ఆడవి కాగా.. ఒకటి మగ పిల్ల. ఐదు పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతో రాజు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కాగా ఐదు పిల్లలకు జన్మనివ్వడంపై స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. పిల్లలను చూసేందుకు ఆసక్తిగా వెళ్తున్నారు.

Tags

Next Story