Uttar Pradesh : చెప్పులు దాస్తే రూ. 5వేలే ఇచ్చాడని వరుడిపై కర్రలతో దాడి..

కొన్ని ప్రాంతాల్లో వివాహాల్లో వరుడి చెప్పులను దాచి కట్నం తీసుకోవడం ఆచారం. ఉత్తరప్రదేశ్ లో బిజ్నోర్‌లో ఓ వరుడిని రూ. 50వేలు డిమాండ్ చేశారు. అతడు రూ. 5వేలు ఇవ్వడంతో గొడవ జరిగింది. తక్కువ డబ్బు ఇచ్చినందుకు వధువు వైపు మహిళలు వరుడిని ‘బిచ్చగాడు’ అని తిట్టడంతో ఇరు కుటుంబాలు దాడి చేసుకున్నాయి. దీంతో వధువు కుటుంబం (బావమరుదులు) వరుడిని రూమ్‌లో బంధించి కర్రలతో కొట్టింది. పోలీసుల జోక్యంతో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరింది.
ఉత్తరాఖండ్‌లోని చక్రతాకు చెందిన వరుడు ముహమ్మద్ షబీర్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతితో శనివారం వివాహం జరిగింది. అనంతరం వివాహ ఆచారాల ప్రకారం నిర్వహించే ‘జూతా చుపాయి’ (చెప్పులు దాచడం)లో భాగంగా వధువు కుటుంబసభ్యులు వరుడి పాదరక్షలు దాచారు. వాటిని తిరిగి ఇవ్వాలంటే రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.50వేలకు బదులు వరుడు రూ.5వేలు ఇచ్చాడు.
దీంతో వారు అతడిని బిచ్చగాడిలా ఇంత తక్కువ డబ్బు ఇచ్చావేంటంటూ తిట్టారు. ఆగ్రహించిన వరుడి తరఫు బంధువులు తమకు ఇచ్చిన బంగారం నాణ్యత గురించి ప్రశ్నించారు. ఇది కాస్తా ముదిరి ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. వధువు బంధువులు వరుడిని గదిలో బంధించి కర్రలతో కొట్టారు. ఈ విషయంపై ఇరు కుటుంబాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి.. రాజీ కుదిర్చినట్లు పోలీసులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com