Viral : డాన్స్ వేసిన వరుడు.. పెళ్లి రద్దు చేసిన మామ!

Viral : డాన్స్ వేసిన వరుడు.. పెళ్లి రద్దు చేసిన మామ!
X

పెళ్లి వేడుకల్లో వధూవరులు డాన్సులు చేయడం సహజమే. కానీ వరుడు డాన్స్ చేసినందుకు వధువు తండ్రి పెళ్లినే రద్దు చేసిన ఆసక్తికర ఘటన ఢిల్లీలో జరిగింది. ఊరేగింపుగా మండపానికి వచ్చిన వరుడు, తన స్నేహితులతో కలిసి ‘చోలీకే పీఛే క్యాహై’ సాంగ్‌కు డాన్స్ వేశాడు. అది కాబోయే మామకు నచ్చలేదు. అలాంటి వాడికి బిడ్డను ఇచ్చేది లేదంటూ పెళ్లిని రద్దు చేశాడు. వరుడు వివరిస్తున్నా వినకుండా ఆడపెళ్ళివారు మండపం నుంచి వెళ్లిపోయారు.

నిమిషాల వ్యవధిలోనే అతడి డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడి డ్యాన్స్ కుటుంబ విలువలను దిగజార్చే విధంగా ఉన్నాయంటూ కథనాలు వచ్చేశాయి. ఇదంతా సరదా కోసమే చేశానంటూ అతడు వివరణ ఇచ్చాడు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పెళ్లి కూతురు తండ్రి మాత్రం ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు.

వధువు కూడా అనూహ్యంగా కంటతడి పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం అంతా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లి రద్దు చేసి మంచి పని చేశారంటూ కొంత మంది సపోర్ట్ చేస్తుంటే.. పెళ్లిలో డ్యాన్స్ చేయడం సహజం అని.. అంత మాత్రానా.. పెళ్లిని రద్దు చేస్తారా అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story