Hyderabad : లాటరీలో రెండు కోట్లు.. జాక్ పాట్ కొట్టిన వాచ్ మన్ రాజమల్లయ్య
దుబాయ్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న హైదరాబాదీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. హైదరాబాద్ కు చెందిన 60 ఏళ్ల నాంపల్లి రాజమల్లయ్య దుబాయ్ లో వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటుంది. అలవాటులో భాగంగా బిగ్ టికెట్ అనే లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఈసారి అదృష్టం వరించి అతనికి లాటరీ తగిలింది. ఇటీవల ప్రకటించిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో రాజమల్లయ్య విజేతగా నిలిచాడు. ఈ లక్కీ డ్రాలో రాజమల్లయ్య వన్ మిలియన్ దిర్హామ్ (రూ. 2 కోట్ల 32 లక్షల 76వేల 460) గెలుపొందాడు. ఓ బిల్డింగ్ కు వాచ్ మన్ గా పనిచేస్తున్న రాజమల్లయ్య 30 ఏళ్ల నుండి లాటరీ కొంటున్నట్లు తెలిపాడు. ఎట్టకేలకు లాటరీ గెలుపొందడంతో రాజమల్లయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ప్రైజ్ మనీని తాను టికెట్ కొనడానికి సాయం చేసిన స్నేహితులతో పంచుకుంటానని, మిగతా మొత్తాన్ని కుటుంబ భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని ఆయన తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com