Bullet Train : భారత్ ఫస్ట్ బుల్లెట్ రైలు రెడీ.. మంత్రి అశ్వనీ వైష్ణవ్ పోస్ట్ వైరల్

Bullet Train : భారత్ ఫస్ట్ బుల్లెట్ రైలు రెడీ.. మంత్రి అశ్వనీ వైష్ణవ్ పోస్ట్ వైరల్

భారత్ సత్తాను తెలుపుతూ రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోది. సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ గా ఉంటుంటారు. తాజాగా ఆయన ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు.

గంటకు 320 కి.మీ. వేగంతో ఈ బుల్లెట్ రైలు ప్రయాణించనుంది. మార్గమధ్యంలో నదులపై 24 వంతెనలపై రెండు గంటల్లో 508 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2026లో ఈ బుల్లెట్ రైలు పట్టాలెక్కనుంది. 2021 నవంబరులో ఈ బుల్లెట్ రైలు పనులు ప్రారంభమయ్యాయి. సంవత్సరానికి 1 కోటి 60 లక్షల మంది ప్రయాణిస్తారని రైల్వే అంచనా వేస్తోంది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం రూ.10వేల కోట్లు, గుజరాత్, మహారాష్ట్ర చెరో రూ.5వేల కోట్లు అందజేస్తున్నాయి. జపాన్ దేశం టెక్నాలజీని అందించడంతోపాటు... మిగిలిన నిధులను 0.1 వడ్డీరేటుతో రుణంగా ఇచ్చింది.

దేశ ప్రధానమంత్రి మోడీ మూడో పాలనలో బుల్లెట్ రైలు కోసం ఎదురుచూడండని పోస్ట్ చేశారు అశ్వనీ వైష్ణవ్. ప్రభుత్వం కలలను కనడంలేదని, వాస్తవాలను సృష్టిస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రపంచస్థాయి ఇంజనీరింగ్ లో ఓ అద్భుతం అని మంత్రి అభివర్ణించారు. దేశంలోనే మొదటిసారిగా స్లాబ్‌ ట్రాక్‌ వ్యవస్థ, భూకంపాలను ముందుగానే గుర్తించే ఏర్పాట్లు, ఏడు సొరంగాలు, సముద్రగర్భంలో ఏడు కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌, 28 స్టీలు వంతెనలు, అత్యాధునిక సౌకర్యాలతో 12 రైల్వేస్టేషన్లు తయారవుతున్నారు. వీటికి లక్ష 8వేల కోట్ల బడ్జెట్ అంచనాలు ఉన్నాయి.

Tags

Next Story