Narsipatnam : పప్పు దినుసులతో వినాయక విగ్రహాం

Narsipatnam : పప్పు దినుసులతో వినాయక విగ్రహాం
X

పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి సంవత్సరం మట్టి గణపతిని తయారు చేయడం ఈ స్వర్ణకారుడికి అలవాటు గతంలో రూపాయి,రెండు రూపాయలు కాయిన్లతో, డ్రై ఫ్రూట్స్ తో, ఇలా పలు రకాల వినాయకుల విగ్రహాలు తయారు చేయడం ఈ స్వర్ణకారుడికి అలవాటు దీనిలో భాగంగా ఈ సంవత్సరం వినాయక చవితికి పప్పు దినుసులతో విద్యా గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. పప్పు దినుసులతో వినాయక విగ్రహాన్ని తయారు చేయడం ఒక సృజనాత్మకమైన ఆలోచన.వివిధ రకాల పప్పు దినుసులతో వినూత్నమైన ఇలాంటి వినాయక విగ్రహాంను రూపొందించడానికి పది రోజులపాటు శ్రమించిన స్వర్ణకారులు వానపల్లి వాసు, వానపల్లి నూకరాజు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని చేసి ఆ విగ్రహాన్ని వివిధ పప్పు దినుసులుతో అలంకరించి అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేశారు.ఈ వినాయక విగ్రహాన్ని నర్సీపట్నం శాంతినగర్ లో నవరాత్రులు పూజలు నిర్వహిస్తారని స్వర్ణకారుడు వాసు తెలియజేశారు.

Tags

Next Story