Folk Dancer Jaanu Liri : జాను లిరి, దిలీప్ పెళ్లి .. సంచలన ప్రకటన

ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ జాను లిరి, సింగర్ దిలీప్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రక టించింది. ప్రముఖ ఫోక్ సింగర్ దిలీప్ దేవ్రన్ని పెళ్లి చేసుకోతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..‘ఆశ్విరదించండి' అని పేర్కొంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ లసింగర్ దిలీప్ దేవ్రన్ కూడా ఇన్స్టాలో ఓ వీడియాని విడుదల చేశారు. 'అందరికి నమస్కారం. నా పాటలు ఆదరించి, నన్ను ఈ స్థాయికి నిలబెట్టిన ప్రేక్షక దేవుళ్లకు, మీడియా మీత్రులకు నమస్కారం. రీసెంట్ గా నేను పోస్ట్ చేసిన ఓ ఫొటోని విపరీతం గా ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే నేను జాను పెళ్లి చేసుకోబోతున్నాం. ఒకరినొకరు ఇష్టం పడ్డాం. కలిసి బతుకాలనుకుంటున్నాం. అంతేకాని ఎలాంటి తప్పు చేయలేదు. మా ఇంట్లో ఒప్పు కున్నారు. జాను ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు చేసిన తట్టుకొని నిలబడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు సపోర్ట్ చేస్తున్నావారికి ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతు న్నారనే క్లారిటీ వచ్చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com