Job Cuts at Oracle : ఒరాకిల్‌లోనూ ఉద్యోగాల కోత..!

Job Cuts at Oracle : ఒరాకిల్‌లోనూ ఉద్యోగాల కోత..!
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో భారీ పెట్టుబడులు పెట్టడంపై దృష్టి సారించడంతో ఆర్కిల్ క్లౌడ్ డివిజన్‌లోని ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టింది. సీటెల్‌లోని క్లౌడ్ హబ్‌లో 150కి పైగా ఉద్యోగాలు తొలగించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఉద్యోగాల కోతకు ప్రధాన కారణం AIలో పెట్టుబడులు పెంచడం. ముఖ్యంగా, ఓపెన్‌ఏఐ (OpenAI) వంటి సంస్థలతో కలిసి పనిచేయడానికి ఆర్కిల్ భారీ AI డేటా సెంటర్లను నిర్మిస్తోంది. దీనికోసం నిధులను సమకూర్చుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. భారత్‌లో ఉన్న ఆర్కిల్ ఉద్యోగులపైనా ఈ కోత ప్రభావం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. వ్యూహాత్మక మార్పులు, పునర్వ్యవస్థీకరణ, లేదా పనితీరు వంటి కారణాల వల్ల ఉద్యోగులను తొలగించడం జరుగుతుందని, అయితే ఈ విభాగంలో ఇతర కీలక స్థానాలకు నియామకాలు కొనసాగుతాయని ఆర్కిల్ తెలిపింది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి ఇతర టెక్ కంపెనీలు కూడా తమ AI పెట్టుబడులను సమతుల్యం చేసుకునేందుకు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

Tags

Next Story