Kendall Jenner: డైపర్ వేసుకున్నావా పాపాయీ...!

Kendall Jenner: డైపర్ వేసుకున్నావా పాపాయీ...!
శ్వేతవర్ణ దుస్తుల్లో మెరిసిన కెండాల్ జెన్నర్..... డైపర్ అంటూ కౌంటర్ ఇచ్చిన నెటిజెన్లు..

ఎలాంటి దుస్తులనైనా అందంగా, హుందాగా క్యారీ చేయడం మోడల్స్ కు మాత్రమే తెలిసిన విద్య. అయితే అప్పుడప్పుడూ తాము వేసుకున్న దుస్తులను బట్టీ ట్రోలింగ్ కు గురవ్వడమూ వారి సాధారణమే. తాజాగా ఇదే విధంగా ట్రోలింగ్ కు గురైంది సూపర్ మోడల్ కెండాల్ జెన్నర్. ఫ్రాన్స్ లో జరిగిన స్ప్రింగ్ సమ్మర్ 2024 షోలో కెండాల్ యధావిధిగా తనదైన స్టైల్ లో స్టేజ్ మీద చెలరేగిపోయింది. శ్వేతవర్ణం బెలూన్ డ్రెస్ లో వైట్ క్వీన్ గా క్యాట్ వాక్ చేస్తూ ఆహూతులను ఆకట్టుకుంది. ఆమె మెరుపు తీగలా రాంప్ పైకి వచ్చి నడుస్తుంటే, ఆ వైట్ క్వీన్ ని చూడడానికి తన అభిమానుల ఆనందం ఆకాశమంత అని చెప్పడం లో ఆశ్చర్యం ఏమీ లేదనిపించింది. అక్కడి వరకూ బాగానే ఉంది. అసలు రాద్దాంతం ఆ తరువాతే మొదలైంది మరి.





ఫ్యాషన్ షో పూర్తవుతూనే కెండాల్ పై నెటిజెన్లు విరుచుకుపడ్డారు. ఆమె ధరించిన శ్వేత వర్ణ దుస్తులు, ర్యాంప్ పై నడిచిన తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా ఆమె ధరించిన డ్రెస్ పైనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఆ కురచ దుస్తుల్లో ఆమె డైపర్ వేసుకున్న పాపాయి మాదిరి ఉందంటూ ట్రోలర్స్ రెచ్చిపోయారు. దీంతో ఒక్కసారిగా కెండార్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది.





ఈ సంగతి పక్కన పెడితే కెండాల్ మెడలో తళతళ మెరుస్తూ కనిపించిన వజ్రాల ఆభరణం మరికొందరి దృష్టిని ఆకట్టుకుంది. అది యువరాణి డయానాను గుర్తుచేసింది. కెండాల్ వేసుకున్న డ్రెస్ 1994లో, ప్రిన్సెస్ డయానా ధరించిన రివెంజ్ డ్రెస్సింగ్ స్టైల్ ను పోలి ఉండటంతో కొందరు పాత స్మృతుల్లోకి జారిపోయారు. ఏమైనా ఇవేమీ పట్టని కెండాల్ మాత్రం చక్కా ఇంకో ర్యాంప్ వాక్ కు రెడీ అయిపోతోంది.

Tags

Next Story