Madhya Pradesh : కూలీకి కలిసొచ్చిన అదృష్టం.. గనిలో దొరికిన 8 వజ్రాలు..

అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్క క్షణంలో బికారీ కాస్త కోటీశ్వరుడు కావొచ్చు. మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఓ కూలీని అలాంటి అదృష్టమే వరించింది. అతడు పనిచేసే నిసార్ గనిలో ఒకటికాదు రెండుకాదు ఏకంగా 8 వజ్రాలు దొరికాయి. వాటి ధర సుమారు రూ. 12లక్షలు ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
ఛతర్‌పూర్ జిల్లాలోని కటియా గ్రామానికి చెందిన హర్‌గోవింద్, పవన్ దేవి దంపతులు గత ఐదేళ్లుగా నిసార్ గనిలో పనిచేస్తున్నారు. వీరికి గనిలో ఒకేసారి 8 వజ్రాలు దొరికాయి. వాటి విలువను నిర్ధారించాక.. వేలంలో వచ్చిన మొత్తం డబ్బుల నుంచి పన్నులు పోగా మిగతా డబ్బును గోవింద్ ఫ్యామిలీకి అందజేస్తారు. దేవుడు తమను కనికరించాడని హరిగోవింద్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఓ వజ్రం దొరికినట్లు తెలిపారు. అప్పుడు తెలియక కేవలం రూ. లక్ష రూపాయలకే అమ్మినట్లు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com