Prakasam: సగం కాలిన శవాన్ని మోసుకెళ్లారు.. లేడీ ఎస్‌ఐ శభాష్ అనిపించుకున్నారు..
Prakasam: పోలీసులు అంటే ఏ పరిస్థితుల్లో అయినా ప్రజలకు రెస్పాండ్ అవ్వా్ల్సిందే. అలాంటి సమయంలో వారికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ పని చేయాల్సిందే. అయితే మనకెందుకులే అని వదిలేయకుండా డ్యూటీలో భాగంగా ఏది చేయడానికి అయినా సిద్దపడేవారు కూడా ఉంటారు. అలాంటి ఓ లేడీ ఎస్‌ఐ ప్రకాశం జిల్లాకు చెందిన కృష్ణ పావని.
ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు మండలం హాజీపురం సమీపంలో ఓ పశువుల కాపరి ఓ మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న కృష్ణ పావని ఆ చోటికి వెళ్లారు. అయితే పూర్తిగా కాలిపోయి ఉండడంతో ఆ మృతదేహం ఎవరిదో కనుక్కోవడం కష్టంగా అనిపించింది.
అయితే మృతదేహం ఎవరిదో తెలియాలంటే పోస్టుమార్టం నిర్వహించాల్సిందే. దానికోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అయితే సమయానికి ఇంక వేరే సిబ్బంది లేకపోవడంతో కృష్ణ పావని.. మరొకరి సాయంతో ఆ కాలిన మృతదేహాన్ని ఆసుపత్రికి మోసుకెళ్లింది. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు, ప్రజలు కృష్ణ పావనిని ప్రశంసిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com