Virat Kohli Likes : విరాట్ కోహ్లి లైక్.. అవినీత్ కౌర్ ఫుల్ పాపులర్

Virat Kohli Likes : విరాట్ కోహ్లి లైక్.. అవినీత్ కౌర్ ఫుల్ పాపులర్
X

జీ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ద్వారా తన 8వ ఏట కెరీర్ ను ప్రారంభించింది అవినీత్ కౌర్. కానీ సెమీ ఫైనల్స్ కు ముందే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత డాన్స్ కే సూపర్స్ స్టార్ లో పాల్గొంది. 2012లో బుల్లితెర నటిగా పరిచయమైన కౌర్.. 2014లో మర్దని సినిమాతో వెండితెరకు పరిచయమైంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామకు ఇన్స్టాలో 3 కోట్లకు పైగా ఫోలోవర్స్ ఉన్నారు. ఇటీవల ఆమె ఫ్యాన్ పేజీలోని ఓ పోస్ట్ ను విరాట్ కోహ్లి లైక్ చేశాడు. దీంతో ఇది కాస్తా చర్చనీయాంశం అయింది. ఈ విషయమై ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇంకా ఆ విషయం గురించి చర్చ సాగుతూనే ఉంది. విషయం ఏమిటంటే విరాట్ కోహ్లి లైక్ కొట్టిన తర్వాత ఆ అమ్మడుకు ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. అవినీత్ కౌర్ కు ఏకంగా 2 మిలియన్ల మంది ఫాలోవర్స్ పెరిగారట. దీనిపై తాజాగా నటి రకుల్ ప్రీతిసింగ్ స్పందిస్తూ... 'ఇది చాలా బాధ కలిగించే విషయం. మనమంతా ఇంత ఖాళీగా ఉన్నామా? ప్రజలు సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేస్తున్నారు. నా దృష్టిలో ఇది అనవసరం' అని పేర్కొంది.

Tags

Next Story