Maharashtra : ఆత్యహత్య కోసం రైలు పట్టాలపై.. యువకుడిని సెకండ్లలో కాపాడిన పొలీస్..!

Maharashtra : ఆత్యహత్య కోసం రైలు పట్టాలపై.. యువకుడిని  సెకండ్లలో కాపాడిన పొలీస్..!
Maharashtra : రైలుపట్టాలపై ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ఓ యువకుడు సిద్దమవ్వగా ఇది గమనించిన ఓ రైల్వే పోలీస్‌ ధైర్యం చేసి అతడ్ని కాపాడాడు.

Maharashtra : రైలుపట్టాలపై ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ఓ యువకుడు సిద్దమవ్వగా ఇది గమనించిన ఓ రైల్వే పోలీస్‌ ధైర్యం చేసి అతడ్ని కాపాడాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. విఠల్‌‌వాడి రైల్వే స్టేషన్ లో ఓ 18 ఏళ్ల యువకుడు రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌ అంచున నిల్చొని ఉన్నాడు.

రైల్ వస్తోందని వెనక్కి జరగాలని ఆ యువకుడిని కోరాడు కానిస్టేబుల్‌ మానే .. ఆ తర్వాత ఆ యువకుడు వెనక్కి వెళ్లాడా లేదా అని కొద్దిసేపు అయ్యాక తిరిగి చూస్తే.. అతను ఫ్లాట్‌ఫామ్‌ నుంచి రైలు పట్టాలపై దూకాడు. దీనితో అతనిని రక్షించేందుకు ముందుగా తటపటాయించిన మానే.. ఆ తర్వాత కాస్త వెనక్కి వెళ్లి వేగంగా రైలు పట్టాలపైకి జంప్ చేసి ఆ యువకుడిని పట్టాల నుంచి అవతలకు తోసేశాడు.

మూడు సెకండ్లలో ఆ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆ స్పాట్‌ నుంచి వేగంగా వెళ్లి స్టేషన్‌ను క్రాస్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యువకుడ్ని కాపాడిన రైల్వే పోలీసు సమయస్ఫూర్తి, ధైర్య సాహసాన్ని అధికారులతోపాటు నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇక యువకుడిని అతని తల్లిదండ్రులకి అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story