Manchu Lakshmi : బాంబ్ పేల్చిన మంచు లక్ష్మి.. టార్గెట్ ఎవరు..?
మంచు ఫ్యామిలీలో గొడవలు ముదురుతున్న వేళ ఆ ఇంటి ఆడపడుచు మంచు లక్ష్మి ప్రసన్న సోషల్ మీడియాలో చేసిన మరో పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఓవైపు అన్నదమ్ముళ్లు కొట్టుకుంటుంటే... మంచు లక్ష్మీ ఓసారి హైదరాబాద్ వచ్చి మళ్లీ ముంబై వెళ్లిపోయారు. ఇటీవల ఓ పోస్టుకు తన కూతురు వీడియో షేర్ చేసి ‘పీస్’ అనే క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంచు లక్ష్మి పెట్టిన మరో పోస్ట్ ఇప్పుడు సోషల్ మాడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఈ లోకంలో ఏదీ నీది కానప్పుడు, ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు’ అంటూ ఆమె ఎక్స్‌లో ఓ ఇమేజ్ కార్డ్ మెసేజ్ ను లక్ష్మీప్రసన్న పోస్ట్ చేశారు. ఇది చూసిన వాళ్లు ఎవరికి వాళ్లు తమదైన వ్యాఖ్యానాలు కామెంట్ల రూపంలో జోడిస్తున్నారు. మనోజ్ టార్గెట్ గా ఉందని కొందరు.. మోహన్ బాబును ఉద్దేశించి పెట్టారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మంచు విష్ణు కూడా గొడవను పక్కకు పెట్టి కన్నప్ప సినిమా షూటింగ్ కు వెళ్లిపోయారు. బుధవారం రాచకొండ సీపీ సుధీర్ బాబు వార్నింగ్ తో గొడవను పక్కనపెట్టి పరిష్కారం వైపు అన్నదమ్ములు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఐతే.. మోహన్ బాబు హాస్పిటల్ లోనే ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com