Manchu Manoj : గేట్లు బద్దలు కొట్టి లోపలికి మనోజ్ ఎంట్రీ..
హైదరాబాద్ పహాడీ షరీఫ్ పరిధి జల్ పల్లి లోని నటుడు మోహన్ బాబు ఫామ్‌హౌస్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఫామ్‌హౌస్‌కు వచ్చిన మంచు మనోజ్, అతడి భార్య, బౌన్సర్లను మోహన్ బాబు మనుషఉలు గేట్లు వేసి అడ్డుకున్నారు. దాంతో బౌన్సర్లతో కలిసి గేట్లు బద్ధలకొట్టుకుని లోపలి వెళ్లాడు మంచు మనోజ్. జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ గేటు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఉద్రిక్తత తలెత్తింది. మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడిచేశారు. మైక్‌లు లాక్కుని అదే మైక్ లతో మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులను బూతులు తిడుతూ మోహన్‌బాబు రెచ్చిపోయారు. తనతో పాటు లైసెన్స్ డ్ గన్ తీసుకురావడంతో.. దాన్ని పోలీసులు సీజ్ చేశారు. విష్ణు గన్ ను కూడా సరెండర్ చేయాలని ఆదేశించారు. ఇవాళ తమ ముందు హాజరుకావాలని రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫాంహౌజ్ వద్ద బలగాలను భారీగా మోహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అడిషనల్ డిసిపి సత్యనారాయణ పరిస్థితి సమీక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com