Dharmasthala : ధర్మస్థల వ్యవహారం.. ముసుగు వ్యక్తి అరెస్టు

Dharmasthala : ధర్మస్థల వ్యవహారం.. ముసుగు వ్యక్తి అరెస్టు
X

ధర్మస్థలలో సామూహిక ఖననాల గురించి సంచలనాత్మక ఆరోపణలు చేసిన భీమా అనే వ్యక్తిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ముసుగు ధరించి మీడియా ముందుకొచ్చిన ఈ వ్యక్తి, ధర్మస్థల పరిసరాల్లో వందల సంఖ్యలో మృతదేహాలను పూడ్చిపెట్టారని ఆరోపించాడు. దీనిపై పెద్ద దుమారం రేగడంతో ప్రభుత్వం SITని ఏర్పాటు చేసింది. అయితే, తాజాగా భీమా తన వాదనను మార్చుకున్నాడు. ఈ ఆరోపణలు తాను స్వచ్ఛందంగా చేయలేదని, కొన్ని ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు తనతో బలవంతంగా చేయించారని SIT ముందు అంగీకరించాడు. అతను చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినా, ఆరోపణలకు సరిపడా ఆధారాలు లభించకపోవడంతో అధికారులు ఆరోపణలు అబద్ధమని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో, ప్రజలను, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడనే ఆరోపణపై పోలీసులు భీమాను అరెస్టు చేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే విషయంపై SIT దర్యాప్తు కొనసాగుతోంది.

Tags

Next Story