Crime News: 'మ్యాట్రిమోనీ' మంచిపని.. నిత్యపెళ్లి కొడుకు బాగోతాన్ని..

Crime News: మ్యాట్రిమోనీ మంచిపని.. నిత్యపెళ్లి కొడుకు బాగోతాన్ని..
Crime News: ఒకప్పుడు పెళ్లిళ్ల పేరయ్యలు మంచి సంబంధాలు చూసేవారు. సదరు వ్యక్తుల గురించి ఆరా తీసి వివరాలు సేకరించేవారు.

Crime News: ఒకప్పుడు పెళ్లిళ్ల పేరయ్యలు మంచి సంబంధాలు చూసేవారు. సదరు వ్యక్తుల గురించి ఆరా తీసి వివరాలు సేకరించేవారు. ఇప్పుడంతా ఆన్‌లైన్ వ్యవహారం.. ఎన్నో వివాహ వేదికలు మ్యాట్రిమోనీల రూపంలో పుట్టుకొస్తున్నాయి. డబ్బే పరమావధిగా పని చేసే వారు కొందరుంటే, మరికొందరు పెళ్లి పేరుతో ఛీటింగ్ చేసే వారిని పట్టి ఇస్తున్నారు.

తాజాగా ఓ నిత్య పెళ్లి కొడుకు బాగోతాన్ని బట్టబయలు చేశారు. ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని నాలుగో పెళ్లికి సిద్ధమైన సాప్ట్‌వేర్ ఇంజనీర్ వంశీకృష్ణ (39)ను పోలీసులకు పట్టి ఇచ్చారు. గతంలోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్న వంశీ కృష్ణ మూడో పెళ్లి కోసి మ్యాట్రిమోనీలో దరఖాస్తు చేసుకున్నాడు. అదే మ్యాట్రిమోనీలో నెల్లూరుకు చెందిన డాక్టర్ మీనారెడ్డి కూడా అప్లై చేసుకున్నారు.

ఆమెకు ఏడాది క్రితమే వివాహం అయింది. కానీ ఇటీవలే భర్త మరణించారు. మ్యాట్రీమోనీలో దరఖాస్తు చేసుకున్న ఆమెకు వంశీకృష్ణ కలిశారు. నెల్లూరు వెళ్లి మీనారెడ్డిని కలిసిన వంశీకృష్ణ ఈనెల 4వ తేదీన వివాహం చేసుకున్నారు. వారం రోజుల అనంతరం మీనారెడ్డి నెల్లూరు వెళ్లి ఈ నెల 24న తిరిగొచ్చింది. అయితే అప్పటికే ఆమెతో వివాహబంధం కొనసాగించడం ఇష్టం లేదని మీనారెడ్డిని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేశాడు.

అనంతరం ఏమీ ఎరగనట్టు మళ్లీ పెళ్లి చేసుకునేందుకు మ్యా్ట్రిమోనీని సంప్రదించాడు. దీంతో అనుమానం వచ్చిన మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు మీనారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. దాంతో ఆమె తనను ఇంట్లో బంధించిన విషయం చెప్పుకొచ్చింది.

మ్యాట్రిమోనీ నిర్వాహకురాలి సూచనమేరకు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది మీనారెడ్డి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీకృష్ణను అరెస్ట్ చేశారు. అతడి మూడు పెళ్లిళ్ల వ్యవహారంలో కుటుంబసభ్యుల పాత్రపై కూడా ఆరాతీస్తున్నారు.

Tags

Next Story