Manchu Family : మోహన్ బాబు, మనోజ్.. దాడులు చేస్తున్నారంటూ పరస్పరం కేసులు

Manchu Family : మోహన్ బాబు, మనోజ్.. దాడులు చేస్తున్నారంటూ పరస్పరం కేసులు
X

మోహన్‌బాబు, మనోజ్‌ ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ కేసులు పెట్టుకున్నారు. బహిరంగ లేఖలు విడుదల చేశారు. జల్ పల్లి ఫామ్ హౌజ్ లో పది మంది వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంచు మనోజ్‌ సోమవారం ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్‌తో తనకు ప్రాణహాని ఉందని మోహన్‌బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్‌, ఆయన భార్య మౌనికపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో జల్‌పల్లిలోని నివాసంలో సన్నిహితుల సమక్షంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ మధ్య చర్చలు జరిపారు. ఫిర్యాదులో మోహన్ బాబు పేరును మనోజ్ చేర్చలేదని.. పది మంది అని మెన్షన్ చేశారని తెలిపారు. తనకు మెడ, తొడ, కడుపులో గాయాలైనట్టు మెడికో లీగల్ రిపోర్ట్ ను పోలీసులకు సబ్మిట్ చేశారు.

Tags

Next Story