West Bengal : అమ్మా నేను దొంగను కాదు.. 12ఏండ్ల బాలుడి సూసైడ్ నోట్

పశ్చిమ బెంగాల్ మేదినీపూర్లో 12 ఏళ్ల బాలుడి ఆత్మహత్య అందరితో కన్నీరు పెట్టిస్తోంది. చిప్స్ దొంగిలించాడనే ఆరోపణల పై బహిరంగంగా అవమానానికి గురవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణందు దాస్ (12) చిప్స్ కొనడానికి ఒక దుకాణానికి వెళ్లాడు. అయితే, దుకాణం యజమాని శుభాంకరీ దీక్షిత్ అనే వ్యక్తిని పదే పదే పిలిచినప్పటికీ స్పందించలేదు. పిల్లవాడు “అంకుల్ నేను చిప్స్ కొంటాను” అని పదే పదే చెప్పినా లోపల ఉన్న యజమాని నుంచి స్పందన రాలేదు. ఎవరూ లేరని, తర్వాత డబ్బులు ఇద్దామనుకొని బాలుడు షాప్ ఎంట్రీ వద్ద ఉన్న చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాడని కుటుంబీకులకు షాపు యజమాని చెప్పారు. కృష్ణందును షాపు యజమాని వెంబడించి, చెంపదెబ్బ కొట్టి, బహిరంగంగా గుంజీలు తీయమని బలవంతం చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లవాడు తీసుకున్న కుర్కురే ప్యాకెట్కి డబ్బులు చెల్లించడాని కి తల్లి ప్రయత్నించానని చెప్పినప్పటికీ, అతను అబద్దం చెప్పాడని ఆరోపించాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, బాలుడు గదిలోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. చివరకు అతడిని అపస్మారక స్థితిలో తల్లి, ఇరుగుపొరుగు వారు గుర్తించారు. రూమ్లో పురుగుల మందు సీసా ఉండటం, బాలుడి నోటి నుంచి నురగ వస్తుం డటంతో, ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు గుర్తించారు. కృష్ణందును వెంటనే దవాఖానకు తరలించి ఐసీయులో చేర్చారు, కానీ కొద్దిసేపటికే అతను మరణించాడు. బాలుడి మరణం తర్వాత దుకాణం యజమాని పారిపోయాడు. ఆత్మహత్యకు ముందు బాలుడు సూసైడ్ నోట్ రాశాడు. అందులో.."అమ్మా, నేను దొంగను కాదు. నేను దొంగతనం చేయలేదు. నేను వేచి ఉండగా (షాపు యజమాని) రాలేదు. తిరిగి వస్తుండగా, రోడ్డు మీద పడి ఉన్న కుర్కురే ప్యాకెట్ ను చూసి దాన్ని తీసుకున్నాను. నాకు కుర్కురే అంటే చాలా ఇష్టం. చనిపోయే ముందు ఇవే నా చివరి మాటలు, దయచేసి నన్ను క్షమించండి" అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com