Monalisa of Kumbh Mela : పూసలమ్మే మోనాలిసా.. బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఇదే

ఇండోర్ కు చెందిన ఓ మహిళ పూసల దండలు అమ్ముతున్న మోనాలిసా అనే యవతి కుంభమేళాలో సెన్సేషన్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోల్లో ఆమె కళ్లు.. హెయిర్ స్టైల్ జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె లుక్‌లో ఉన్న ఆ చక్కని చిరునవ్వు, చూస్తే చూడాలనిపించే అందం, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుత కుంభమేళలో ఆమె ఫొటోలు, వీడియోలు తెగ వైరల్‌గా మారాయి. ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి అనుకోకుండా ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. మహా కుంభమేళాలో తన మాలను అమ్ముతూ రోజుకు 2వేల నుండి 3 వేలు సంపాదిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఫిబ్రవరి ముగిసేలోగా లక్షన్నరకు పైగా సంపాదించాలనే తన ఆశను కూడా ఆమె వెల్లడించింది. ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ అందం ఖచ్చితంగా సినిమా వాళ్ల దృష్టిలో పడుతుందని సినిమా చాన్సులు వస్తాయని...ఇవ్వాలని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమెకు లభించిన పబ్లిసిటీతో చాలా మంది ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వ్యాపారం జరగడం లేదని గమనించిన తండ్రి కుమార్తెను తిరిగి మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని ఇంటికి పంపించేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com