దోమల టోర్నడోలు.. పుణె నగరంపై దండయాత్ర

దోమల టోర్నడోలు.. పుణె నగరంపై దండయాత్ర

దోమల దండయాత్ర ఎన్నడూ ఎవరూ చూసి ఉండరు. కానీ పుణె నగరంలో ముఠా నదిపై దోమల టోర్నడో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దోమల సుడిగాలిగా చెప్పే ఈ దోమల దండయాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లో ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఖరాడి, కేశవనగర్, ముంధ్వా ప్రాంతాలలో దోమల దండయాత్ర ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురిచేస్తోంది. పుణె వాసులు ఇప్పుడు దోమల సమస్యతో పోరాటం చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా తలుపులు,కిటీకీలు మూసే ఉంచుతున్నారు. గుంపులు గుంపులుగా దాడి చేస్తున్న దోమలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

కాసేపు బాల్కనీలో కూర్చోవాలన్నా ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడింది. పిల్లలు బయట ఆడుకోవడానికి కూడా వెళ్లడంలేదు. విపరీతమైన దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నది గర్భంలో కొనసాగుతున్న ప్రాజెక్టులలో, ఆనకట్టతో పాటు నీటి శుద్ధి కర్మాగారం ఉన్నాయని.. ప్రాజెక్టుల వల్ల అక్కడ నీటి ప్రవాహం తగ్గి, మురుగు చేరి దోమల వృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని.. ఫలితంగా దోమల తుఫాను తమ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతుందని వారు అంటున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ట్యాక్స్ కట్టనివారిపై మున్సిపల్ సిబ్బంది దోమలతో ప్రేమ సందేశం పంపించారన్న సెటైర్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story