Manchu Manoj : మా అన్న మమ్మల్ని చక్కెర పోసి చంపాలనుకున్నారు.. మంచు మనోజ్ ఫిర్యాదు

మంచు మోహన్ బాబు ఇంట్లో తాజాగా మరో వివాదం చోటు చేసుకుంది. తండ్రీకొడుకులకు పరిమితమైన విభేదాలు ఈసారి అన్నదమ్ములకు చేరాయి. తన కుటుంబం మొత్తాన్ని చంపేందుకు తన సోదరుడు మంచు విష్ణు కుట్ర చేశాడని మనోజ్ పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అన్న దమ్ముల మధ్య ఆదివారం జన రేటర్ విషయంలో చోటు చేసుకున్న వివాదం చివరకు ఠాణాకు చేరుకుంది. తనతో పాటు భార్య, తొమ్మిది నెలల బిడ్డను చంపేందుకు విష్ణు కుట్ర చేశాడని మనోజ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మనోజ్ మీడియాకు పలు విషయాలు వెల్లడించాడు. రాచ కొండ పోలీసులు హెచ్చరించినా తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఏకంగా తన కుటుంబం మొత్తాన్ని హత్య చేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. తన తల్లి బర్త్ డేను అడ్డం పెట్టుకొని నా ఇంట్లోకి వచ్చిన మంచు విష్ణు జనరేటర్ లో డీజిల్ లో చక్కెరను కలిపి పోశాడని ఆరోపించారు. జనరేటర్లో చక్కెర పోస్తుండటం చూసిన మంచు విష్ణు బెదిరించారన్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చారన్నారు. జనరేటర్లో చక్కెర కలవడంతో విద్యుత్ లో భయంకరమైన హెచ్చు తగ్గులు జరిగాయని, తన కుటుంబం మొత్తాన్ని దారుణంగా హత్య చేసేందుకు సోదరుడు విష్ణు తన అనుచరులతో కలిసి పథకం పన్నారని మనోజ్ కంప్లయింట్ చేశారు.
జల్ పల్లిలో శనివారం మోహన్ బాబు భార్య బర్త్ డే పార్టీ జరుగుతుండగా ఒక్కసారిగా కరెంట్ ఆగిపోయింది. ఆ సమయంలో జనరేటర్ ను ఆన్ చేసి చూసారు. చీకట్లో స్పష్టంగా కనిపించక పోవడంతో ఆదివారం ఉదయం చూడగా జనరేటర్లో అన్న మంచు విష్ణు, అలాగే మరికొందరు పంచదార పోసినట్లు గుర్తించామని మనోజ్ తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పంచదార పోశారని మంచు మనోజ్ పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదులో తనతో పాటు కుటుంబ సభ్యులను కరెంట్ పిక్షన్ చేసి చంపాలని కుట్ర చేసారని, నాతోపాటు భార్య, పిల్లలు, తల్లిని చంపే ప్రయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారం రోజుల క్రితం కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేశానని, వాళ్లే ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి కుట్ర చేశారని మనోజ్ చెబుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com