Varun Tej Lavanya : తల్లిదండ్రులైన వరుణ్ తేజ్-లావణ్య దంపతులు

మెగా హీరో వరుణ్ తేజ్ - సతీమణి లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమా ‘మన శంకరవరప్రసాద్’ షూటింగ్ సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్యలను పరామర్శించి, వారిని అభినందించారు.
గత మే నెలలో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో 'జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాను. కమింగ్ సూన్' అనే క్యాప్షన్‌తో శుభవార్తను పంచుకున్నారు. ఇప్పుడు వారికి బాబు పుట్టడంతో మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమ ప్రయాణం 2017లో ‘మిస్టర్’ సినిమాతో మొదలైంది. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి, 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com