పంజాబీ సింగర్ ధిల్లాన్ ఇంటిపై కాల్పులు .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X
By - Manikanta |3 Sept 2024 12:30 PM IST
ప్రముఖ పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం రేపాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన నిందితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెనడా వాంకోవర్‌లోని విక్టోరియా ఐలాండ్‌లో ధిల్లాన్ నివాసం వెలుపల కాల్పులు జరిగినట్లు సమాచారం. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లార్సెన్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన రోహిత్ గోదారా అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. సల్మాన్‌ఖాన్ సినిమాలో పాడినందుకే ధిల్లాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లు సమాచారం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com