'పొట్ట పెంచుదాం'..వైరల్‌ అవుతున్న రెస్టారెంట్‌ పేరు!

పొట్ట పెంచుదాం..వైరల్‌ అవుతున్న రెస్టారెంట్‌ పేరు!
బయట కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి.. అందులో ఫుడ్ సంగతి ఏమో కానీ, ఆ పేరు చూస్తేనే లోపలికి వెళ్ళాలని అనిపిస్తుంది.

బయట కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి.. అందులో ఫుడ్ సంగతి ఏమో కానీ, ఆ పేరు చూస్తేనే లోపలికి వెళ్ళాలని అనిపిస్తుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఓ రెస్టారెంట్ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇంతకీ ఆ రెస్టారెంట్ పేరు ఏంటంటే... 'పొట్ట పెంచుదాం'.. వినడానికి చాలా తమాషాగా ఉంది కదా.. అవును... ఈ రెస్టారెంట్ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొత్తగా ఏర్పాటైంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ హోటల్ కి ఎక్కడ లేని క్రేజ్ వస్తుంది. పేరే ఇంత వెరైటీగా ఉంది ఇంకా ఫుడ్ ఎంత వెరైటీగా ఉంటుందో చూద్దామని చాలా మంది క్యూ కడుతున్నారు కూడా.. దీనితో అనతికాలంలోనే ఈ రెస్టారెంట్ కి మంచి పేరు డిమాండ్ ఏర్పడిందట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story