Sara Tendulkar : ఆస్ట్రేలియా టూరిజం అంబాసిడర్ గా సారా టెండుల్కర్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఆస్ట్రేలియా టూరిజం ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ‘కమ్ అండ్ సే గ’డే’ (Come and Say G'day) అనే పేరుతో ఒక భారీ గ్లోబల్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం విలువ సుమారు $130 మిలియన్లు (సుమారు ₹1,137 కోట్లు).ఈ ప్రచారం ద్వారా భారతదేశంలోని యువతను, పర్యాటకులను ఆకర్షించేందుకు సారా టెండూల్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. సారా టెండూల్కర్ మాత్రమే కాకుండా, ఈ ప్రచారంలో భాగంగా ప్రపంచంలోని వివిధ దేశాల ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించారు.ఈ ప్రచారం మొదటగా చైనాలో ఆగస్టు 7న ప్రారంభమై, ఆ తర్వాత ఇతర దేశాలలో క్రమంగా విస్తరిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా భారతీయ పర్యాటకుల సంఖ్య ఆస్ట్రేలియాలో గణనీయంగా పెరుగుతుందని ఆస్ట్రేలియా టూరిజం అధికారులు ఆశిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com