Uttar Pradesh : గేదెల కోసం రెండో పెళ్లి.. సామూహిక పెళ్లి వేడుకలో మహిళ నిర్వాకం

ఉత్తరప్రదేశ్ లోని హసనూర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గేదెల కోసం ఓ మహిళ రెండో పెళ్లికి సిద్ధమైంది. మరికాసేపట్లో వివాహం అనగా, ఆమె అత్తమామల ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహ వేడుక జరుగుతోంది. దాదాపు 300 మంది వధూ వరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి, పెళ్లి పీటలపై కూర్చున్నారు. వీరిలో అస్మా అనే మహిళ కూడా ఉంది. ఈమెకు మూడేళ్ల క్రితం నూర్ మహ్మద్తో వివాహమైంది. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. విడాకుల అంశం కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం ఆదివారం 300 జంటలకు సామూహిక వివాహ వేడుకను నిర్వహించింది.
ఈ పథకం కింద వధువుకు రూ.35,000 నగదుతోపాటు పలు బహుమతులు కూడా అందించింది. ఈ ఉచిత పథకం గురించి తెలుసుకున్న అస్మా.. రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన బంధువు జాబర్ అహ్మద్ రెండో పెళ్లికి సిద్ధమైంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు, ఇతర బహు మతులను పంచుకోవాలని ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వం కిట్, దుపట్టా, వెండి కాలి మెట్టెలు తదితర వస్తువులు ఉన్నాయి. ఇక నగదుతో గేదెలను కూడా కొనాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇక మరికాసేపట్లో వివాహం జరుగుతుందనంగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అస్మా . అత్తమామల ఎంట్రీతో సీన్ మారిపోయింది. వివాహ ధృవీకరణ పత్రంతో అస్మా అత్తమామలు అక్కడికి చేరుకొని ఆమెపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు అస్మా, జాబర్ అహ్మద్ప కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com