Traffic Police : యువకుడిపై ట్రాఫిక్ పోలీస్ దారుణం.. వీడియో వైరల్

ఇంటర్నెట్ లో వైరల్ (Viral) అవుతోన్న ఓ వీడియోలో.. యువకుడిని ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ దారుణంగా కొడుతుండడం షాకింగ్ కు గురి చేస్తోంది. ఈ విషయంపై ముంబై ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌ట్రాక్ట్ చేసి క్లారిటీ ఇచ్చింది. డిపార్ట్‌మెంట్ రిప్లైని పోస్ట్ చేసింది. "ప్రియమైన ముంబైవాసులారా, ఇది వేరే నగరానికి చెందిన పాత వీడియో అని దయచేసి గమనించండి. సంబంధిత పోలీసు విభాగం ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకుంది" అని పోస్టులో తెలిపింది.
పట్టపగలే ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ యువకుడిని తన్నడం, చెంపదెబ్బ కొట్టడం వీడియోలో కనిపించింది. ఈ వైరల్ వీడియోలో తనపై హింసను ఆపాలని యువకుడు చేతులు జోడించి వేడుకున్నాడు.
ఈ వీడియో శుక్రవారం (ఫిబ్రవరి 9) సోషల్ మీడియాలో షేర్ అయింది. దీంతో క్షణాల్లోనే వైరల్ అయింది. ఈ వీడియో 'X'లో వేల సంఖ్యలో వ్యూస్ ను పొందింది.
పోలీసుల దౌర్జన్యాన్ని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యువకులను దారుణంగా కొట్టిన ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ వైరల్ వీడియోను గుర్తించి, నిందితుడైన పోలీసు అధికారిపై త్వరగా, అవసరమైన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను (Devendra Fadnavis) కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com