Maharashtra : నిన్న కునాల్.. నేడు స్వాతి సచ్ దేవా.. వివాదాల్లోకి స్టాండప్ కమెడియన్లు

వాక్ స్వాతంత్ర్యం పేరుతో కమెడియన్లు, యూట్యూబర్లు హద్దులు దాటుతున్నారు. అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. మహారాష్ట్రలో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యాఖ్యల దుమారం కొనసాగుతుండగానే, తాజాగా మరో స్టాండప్ కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. స్వాతి సచ్ దేవా వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను ఊహించని విధంగా ఒక విషయంలో తన తల్లికి దొరికిపోయానని, ఆ సమయంలో ఆమెతో మాట్లాడటానికి ఎంతో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. అదే సమయంలో ఏ విషయంలో అలా జరిగిందో కూడా వివరించింది. స్వాతి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com