Sunny Leone : మళ్లీ పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్

Sunny Leone : మళ్లీ పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్
X

సన్నీ లియోన్ మళ్లి పెళ్లి చేసుకుంది. ఒకప్పటి శృంగార తార సన్నీ లియోన్ బాలీవుడ్ ను పదేండ్లు ఏలింది. సౌత్ లోనూ ఊపు ఉపేసింది. మంచు మనోజ్ కరెంటు తీగ చిత్రంలోనూ నటించింది. సన్నీ అడల్ట్ ఇండస్ట్రీ సహచరుడైన డేనియల్ వెబర్ ని 2011లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట అన్యోన్యంగా ఉంటున్నారు. వారి సరోగసీ పిల్లలు, దత్త పుత్రికలతో కలిసి ఆనందమయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 13ఏళ్ల తర్వాత భర్త డేనియల్ వెబర్ ను సన్నీలియోన్ మరోసారి పెళ్లి చేసుకుంది. గత నెల 31న మాల్దీవులలో తన భర్తలో వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకుంది. తన కుమార్తె నిషా సన్నీ.. కొడుకులు నోహ్, ఆషర్ తమ తండ్రితో కలిసి ఆమె కోసం వేచి చూస్తుండగా.. సన్నీ అక్కడికి వచ్చి డేనియల్ ఒక కొత్త పెళ్లి ఉంగరంతో సన్నీకి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story