MK Stalin: అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కి సీఎం.. ఎస్సై సీట్లో కూర్చొని!

Mk Stalin : వినూత్నమైన నిర్ణయాలతో తనదైన మార్క్‌తో ముందుకు వెళ్తున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తాజాగా అర్ధరాత్రి ఓ పోలీస్ స్టేషన్‌ని సందర్శించి అందరిని ఆశ్చర్యపరిచారు. నిన్న ఆర్ధరాత్రి సమయంలో సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న సీఎం.. మధ్యలో అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అక్కడ ఎస్సై సీటులో కూర్చొని పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల గురించి పరిశీలించారు. ఆ కేసులు ఎక్కడివరకు వచ్చాయో ఆరా తీశారు. సిబ్బంది బాగోగులు గురించి అడిగి తెలుసుకున్నారు. దాదాపుగా 15 నిమిషాల పాటు పోలీస్ స్టేషన్లో ఉన్న సీఎం ఆ తరవాత వెళ్లిపోయారు.
இரவும் பகலும் காவல் காத்து சட்டம் - ஒழுங்கை நிலைநிறுத்திடும் மகத்தான பணி காவல்துறையினருடையது!
— M.K.Stalin (@mkstalin) September 29, 2021
அதியமான்கோட்டை காவல்நிலையத்தில் திடீர் ஆய்வு மேற்கொண்டு, பொதுமக்கள் அளித்துள்ள புகார்கள் மீதான நடவடிக்கைகள் குறித்து கேட்டறிந்தேன்.
வள்ளுவர் வாக்கின்படி முறைசெய்து காப்பாற்றுவோம்! pic.twitter.com/mGttKYTX9v
సీఎం ఆకస్మిక తనిఖీతో పోలీసులు హడలిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అంతకుముందు జూన్‌లో, స్టాలిన్ చెన్నైలోని రేషన్ షాపులను ఆకస్మికంగా సందర్శించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు ఎలాంటి ఆలస్యం లేకుండా సరిగ్గా అందుతున్నాయో లేదో సమీక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com