Jaggayyapet : జగ్గయ్యపేటలో క్షుద్రపూజల కలకలం

Jaggayyapet : జగ్గయ్యపేటలో క్షుద్రపూజల కలకలం
X

NTR జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలులో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. ఇవాళ అమావాస్యకు కావడంతో నిన్న రాత్రి గ్రామ శివారు పంట పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. పంట పొలాల సమీపంలో మూడు దారుల మధ్య రెండు బొమ్మలు వేసి క్షుద్ర పూజలు నిర్వహించారు. తెల్లవారేసరికి క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు కూలీలు, గేదెల కాపర్లు భయపడుతున్నారు. క్షుద్ర పూజలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు

Tags

Next Story