Puri Jagannath Temple : పూరీ ఆలయ శిఖరంపై జెండాను ఎత్తుకెళ్లిన గద్ద

ఒడిశా రాష్ట్రం పూరీలోని ప్రముఖ జగన్నాథ ఆలయంలో అనూహ్య ఘటన చోటుచే "సుకుంది. ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రంపై ఎగిరే పతిత పావన జెండాను ఓ గద్ద ఎత్తుకెళ్లి పోయింది. జెండాను నోట కరిచి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టి, తర్వాత సముద్రంవైపు వెళ్లిపోయింది. ఈ పరిణామం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. కొందరు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఆ వీడియో వైరల్ అయ్యాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఆలయ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సాధారణం గా పూరీకి వచ్చే భక్తులు తొలుత పతితపావన జెండాను దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆల యంలో జగన్నాథుడి దర్శనం కోసం వెళ్తారు. శిఖరంపై ఎగురవేసే పతాకాన్ని ప్రతిరోజూ మారుస్తారు. సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేయడం ఆనవాయితీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com