Fishermen Die : పట్టుకున్న చేప ప్రాణం తీసింది!

Fishermen Die : పట్టుకున్న చేప ప్రాణం తీసింది!
X

చెన్నైలో చేపలు పడుతున్న ఓ వ్యక్తి, చేప వల్లే చనిపోయాడు. మణికందన్ అనే వ్యక్తి కీలావలంలోని చేపల చెరువులో రెండు చేపల్ని పట్టుకున్నారు. ఒకదాన్ని చేతితో, మరోదాన్ని నోటితో పట్టుకుని ఒడ్డుకు ఈదుకుంటూ వస్తుండగా నోటితో పట్టుకున్న చేప ఆయన గొంతులోకి వెళ్లిపోయింది. అక్కడే అది ఇరుక్కుపోవడంతో మణికందన్ విలవిల్లాడారు. స్థానికులు సాయం చేసేలోపే ప్రాణాలు విడిచారు. అయితే సాధారణ చేపలు నోట కరిస్తే ఈ సమస్య వచ్చుండేది కాదని.. కానీ మణికందన్ నోట్లో పెట్టుకున్నది సనంగొట్టై చేప అని స్థానికులు వివరించారు.క్లైంబింగ్ పెర్చ్ (అనాబాస్ టెస్టూడినియస్) గా పిలిచి పనంగొట్టై చేప... తేమగా ఉన్నచోట నుంచి బయటపడేందుకు అనేక శక్తి కల్గి ఉంటుందని తెలిపారు. దీనికి పదునైన ముళ్లు గల రెక్కలు ఉంటాయని.. అవి భయపడినా, ప్రమాదంలో ఉన్న వాటిని ఉపయోగించుకునే ప్రాణాలు కాపాడుకుంటాయని అన్నారు. అయితే మణికందన్ దాన్ని నోట కరవడంతో భయపడి గొంతులోకి చొచ్చుకుపోయిందని.. ఈక్రమంలోనే దాని రెక్కలు మరింత పెద్దవిగా మారి ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు.

Tags

Next Story