Viral News : తమిళనాడు పోలీసులను పరుగులు పెట్టించిన ఘనుడు

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జిరంజన్ సాహూ అనే వ్యక్తి చెన్నై పట్టణంలోని ప్రభుత్వ బస్సుల సముదాయం కొయ్యం బెడ్ వద్ద నిలిపి ఉన్న తమిళనాడు ఆర్టీసీ బస్సును డిపో నుండి దొంగలించి డ్రైవింగ్ చేసుకుంటూ రాష్ట్రం దాటుకొని ఆంధ్రకు వచ్చేసాడు.. డిపోలో బస్సు కనిపించకపోవడంతో తమిళనాడు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమిళనాడు పోలీసులకు సమాచారంతో అప్రమత్తమైన జిల్లా పోలీసు అధికారులు బస్సు నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైపుకు వెళుతున్నట్టు గుర్తించి ఆత్మకూరు స్టేషన్ వారికి సమాచారం ఇవ్వడంతో ఆత్మకూరు సిఐ గంగాధర్ వెంటనే తమ సిబ్బందిని అలర్ట్ చేసి ఈ వాహనాన్ని ఆత్మకూరు ఎస్సై జిలాని,సాయి లు మరియు వారి సిబ్బంది ద్వారా నెల్లూరు పాలెం వద్ద పట్టుకున్నారు. ఆ బస్సును స్వాధీనం చేసుకొని ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు తరలించారు.. తమ బస్సును ఆత్మకూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న సమాచారంతో అక్కడనుండి ఈరోజు అక్కడి ఆర్టీసీ అధికారులు మరియు పోలీసులు ఆత్మకూరు చేరుకొని నిందితున్ని అదుపులో తీసుకొని ఆత్మకూరు పోలీసులు మరియు ఆర్టీసీ డిపో అధికారుల సహకారంతో బస్సును చెన్నైకు తీసుకొని వెళ్ళిపోయారు... ఆత్మకూరు సిఐ గంగాధర్ సౌజన్యంతో స్థానిక ఎస్సై లు జిలాని,సాయి మరియు వారి సిబ్బంది చాకచక్యంగా బస్సును పట్టుకోవడంతో చెన్నై ఆర్టీసీ సిబ్బంది మరియు అధికారులు వీరికి ధన్యవాదాలు తెలిపారు.. దొంగలించిన వ్యక్తి పూర్తి వివరాలు తెలుసుకొని తమిళనాడులో కేసు నమోదు చేస్తామని తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com