Suicide : తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య

Suicide : తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య
X

చెన్నైలో తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టించింది.

చెన్నైలోని బ్రిటానియా నగర్, ఫస్ట్ స్ట్రీట్‌లోని తన ఇంట్లో బుధవారం రాత్రి (జూలై 9, 2025) నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ ఆయన తన తల్లికి, స్నేహితులకు, బంధువులకు మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లాగా సమాచారం.

తిరుమల మిల్క్ డెయిరీలో సుమారు రూ.45 కోట్ల మేర మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని పోలీసులు నవీన్‌కు నోటీసులు జారీ చేశారు.

పోలీసులు విచారణకు పిలిచిన తర్వాత, విచారణకు హాజరు కాకుండానే నవీన్ ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలకు దారితీసింది. అరెస్ట్ భయంతోనే నవీన్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది.

Tags

Next Story