Bengaluru : త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ నెలకు రూ.2.70 లక్షలు!

Bengaluru : త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ నెలకు రూ.2.70 లక్షలు!
X

సొంత ఇళ్లు లేని వారు అద్దె ఇంటికి నెలకు ఎంత మొత్తం చెల్లిస్తారు? దీనికి సమాధానం కచ్చితంగా చెప్పలేము. కానీ వేలల్లో ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. బెంగళూరులో లక్షల్లో ఉంటుందంటే నమ్ముతారా? వినేందుకే భయం వేస్తుంది కదూ. ఓ త్రిబుల్ బెడ్రూమ్ ఇంటికి నెలకు ఏకంగా రూ.2.7 లక్షల అద్దె వసూలు చేస్తున్నారట. హరలూర్ ప్రాంతంలో 1,464 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్మెంట్ లో ప్లాట్లో ఉండాలంటే నెలకు రూ.2.7 లక్షల అద్దెతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ కింద మరో రూ.15 లక్షలు చెల్లించారట. ఐటీ ఉద్యోగుల నుంచి డిమాండ్ కారణం ఆ ప్రాంతంలో అద్దె భారీగా పెరుగుతూ వస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతు న్నారు. కొంత మంది నిజమే మేము కూడా పెద్దమొత్తంలో అద్దె చెల్లిస్తున్నట్లు కామెంట్లు పెడుతుండగా, మరికొందరు మాత్రం ఆ ప్రాంతంలో అంత మొత్తం అద్దె ధరలు లేవని, అది నిజం కాదంటూ కామెంట్ చేస్తున్నారు.

Tags

Next Story