AP : ట్రంప్ గెలుపు.. నిడదవోలులో సంబరాలు

AP : ట్రంప్ గెలుపు.. నిడదవోలులో సంబరాలు
X

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఆనందం నింపింది. గ్రామస్థులంతా బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీనికి కారణం అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన జేడీ వాన్స్‌ భార్య ఉషా వాన్స్‌ తెలుగింటి ఆడపడుచుకావడమే. ఆమె ఇప్పుడు అగ్ర రాజ్యానికి రెండో మహిళగా వ్యవహరించనున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో వడ్లూరు గ్రామం ఉంది. 30 ఏళ్ల క్రితం ఉషా తాత రామశాస్త్రి ఇచ్చిన 20 సెంట్ల స్థలంలో ఆలయం, కల్యాణ మండపం నిర్మించారు. తమ ఆనందాన్ని అమెరికాలో ఉన్న వారికి తెలియజేశామని బంధువు దువ్వూరి వరలక్ష్మి తెలిపారు. ఏపీ మూలాలు ఉన్న ఉషా చిలుకూరిని రాష్ట్రానికి ఆహ్వానిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆమెను వడ్లూరు రావాలని కోరుకుంటున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

Tags

Next Story