వైరల్

ఎంత పని చేశావే జడ..! రూ.2 కోట్లు ఫైన్ కట్టించింది

ఆడవారు జుట్టును ఎంత అపురూపంగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎంత పని చేశావే జడ..! రూ.2 కోట్లు ఫైన్ కట్టించింది
X

ఆడవారు జుట్టును ఎంత అపురూపంగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జుట్టు ఒత్తుగా ఉండడానికి ఎన్నో రకాల షాంపులు, కండీషనర్‌లు, నేచురల్ రెమిడీలను ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అలాంటి జుట్టును పొరపాటున ఎవరైనా కత్తిరిస్తే.. ఆ విషయం ఎవరినైనా బాధిస్తుంది. అలాంటి ఒక సంఘటనే ఢిల్లీలో జరిగింది. తన జుట్టును అనవసరంగా కత్తిరించారంటూ ఒక మహిళ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించగా వారు ఇచ్చిన తీర్పు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అయిదు నెలల క్రితం.. మోడల్‌గా పనిచేస్తున్న ఓ మహిళ తన జుట్టును స్టైలింగ్ చేయించుకోవడానికి హోటల్ మౌర్యలోని ఒక సెలూన్‌కు వెళ్లింది. అక్కడి హెయిర్ స్టైలిస్ట్ పొరపాటున ఆ మహిళ జుట్టును చిన్నగా కత్తిరించింది. ఇది గమనించిన మహిళ వారిపై కోప్పడడంతో వారు వెంటనే హెయిర్ ట్రీట్మెంట్‌ను అందించారు. కానీ ఆ ట్రీట్మెంట్ వల్ల తన జుట్టంతా కాలిపోయింది.తన జుట్టు వల్ల తాను ఎన్నో మోడలింగ్ ఛాన్సులను కోల్పయింది.

దాని వల్ల తనకు ఉపాధి కూడా లేకుండా పోయిందని ఆ మహిళ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌‌లో ఫిర్యాదు చేసింది.దీంతో వారు ఆ సెలూన్‌పై రూ. 2 కోట్ల జరిమానాను విధించారు. జుట్టు కోసం చికిత్స చేయించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని జస్టిస్ ఆర్‌కె అగర్వాల్, డాక్టర్ ఎస్‌ఎమ్ కాంతికర్‌లు జరిమానాకు ఉత్తర్వులు జారీచేసారు.

Next Story

RELATED STORIES