Ukraine Soldier Proposal: ఓవైపు యుద్ధం.. మరోవైపు ప్రేమ.. వైరల్ అవుతున్న ఉక్రెయిన్ సైనికుడి ప్రపోజల్..

Ukraine Soldier Proposal: మరోవైపు రష్యా దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కాంప్రమైజ్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తాజా సమాచారం.. రష్యా దూకుడును తట్టుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.. సహకారం అందిస్తాయనుకున్న నాటో దేశాలు చేతులెత్తేయడంతో చేసేది లేక రాజీ మార్గాలు చూస్తున్నారని తెలుస్తోంది.. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా జెలెన్‌స్కీ లొంగిపోతే యుద్ధం నిలిపివేస్తామంటూ చెప్తున్నారు. మధ్యలో ప్రజల పరిస్థితి అయోమయంగా ఉంది. ఇదే సందర్భంలో ఓ ఉక్రెయిన్ సైనికుడు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా సైన్యం వేగంగా అడుగులు వేస్తోంది.. అటు రష్యా దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి ఉక్రెయిన్ సేనలు.. దీంతో రక్తపాతం జరుగుతోంది.. ఈ యుద్ధంలో సైనికులతోపాటు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.. 400 మంది ఉక్రెయిన్ పౌరులు ఇప్పటి వరకు మృతిచెందినట్లుగా ఆ దేశం ప్రకటించింది.
అయితే తాజాగా ఉక్రెయిన్‌లో జరిగిన ఓ సంఘటన వైరల్ అవుతోంది. ఉక్రెయిన్ చెక్‌పోస్ట్ దగ్గర కొందరు కారులో వస్తుండగా.. సైనికులు వారిని అడ్డుకున్నారు. వారందరినీ చెక్ చేయాలంటూ వెనక్కి తిరగమన్నారు. అందులో ఓ మహిళ వెనక్కి తిరిగి చూసేలోపు ఓ సైనికుడు మోకాలిపై కూర్చొని రింగ్‌తో తనకు ప్రపోజ్ చేశాడు. ఇదంతా అక్కడ ఉన్నవారు రికార్డ్ చేశారు. ఇది చూడడానికి చాలా క్యూట్‌గా ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
#Watch#Ukraine️ pic.twitter.com/4DeRtEgivM
— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) March 7, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com