VC Sajjanar: బస్సే క్షేమం అంటున్న 'రాధే శ్యామ్' టీమ్.. వీసీ సజ్జనార్ ఫన్నీ ట్వీట్..

VC Sajjanar: ఈమధ్య మీమ్స్ అనేవి సోషల్ మీడియాలో చాలామందికి నచ్చే అంశంగా మారిపోయింది. అందుకే సెలబ్రిటీలు కూడా ఈ మీమ్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ రూల్స్‌ను గుర్తుచేయడానికి సినిమా పోస్టర్లు ఉపయోగించి మీమ్స్ చేస్తున్నారు. తాజాగా వీసీ సజ్జనార్ కూడా అలాంటి ఓ ఫన్నీ మీమ్‌ను తయారు చేసి ట్వీట్ చేశారు.
మార్చి 11న 'రాధే శ్యామ్' సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. రాధే శ్యామ్ మ్యనియానే నడుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మూవీ లవర్స్ కూడా రాధే శ్యామ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఆర్‌టీసీ బస్సు క్షేమం అని రాధే శ్యామ్ టీమ్‌తోనే చెప్పించాడు సజ్జనార్. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్‌గా మారింది.
'రాధే శ్యామ్' పోస్టర్లను ఉపయోగించి ఓ మీమ్ తయారు చేశారు సజ్జనార్. ఆర్‌టీసీ బస్సులోనే వెళదాం అని పూజా అడుగుతున్నట్టుగా ఆ పోస్టర్లపై మ్యాటర్‌ను జతచేశాడు. ఆర్‌టీసీనే ఎందుకు అని ప్రభాస్ అడగగా.. ఎందుకంటే ఆర్‌టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం అని పూజా చెప్తున్నట్టుగా దానిని తయారు చేశారు. చివరిలో.. బస్సే క్షేమం అంటున్న 'రాధే శ్యామ్' అంటూ ఈ మీమ్‌ను ఎండ్ చేశారు. సజ్జనార్ క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.r
#TSRTC బస్సులోనే వెళ్దాం అంటున్నా #RadheShyam Choose TSRTC & Encourage the #publictransport @TSRTCHQ @TV9Telugu @SakshiHDTV @ntdailyonline @News18Telugu @baraju_SuperHit @telugufilmnagar @Sreeram_singer @puvvada_ajay @Govardhan_MLA @TeluguBulletin @ChaiBisket @boxofficeindia pic.twitter.com/3QuEsYqN9i
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 10, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com