Viral : ఆడు మగాడ్రా బుజ్జి.. ఒకే బైక్‌పై 4 గురు.. ముగ్గురు లేడీస్ కూడా!

Viral : ఆడు మగాడ్రా బుజ్జి.. ఒకే బైక్‌పై 4 గురు.. ముగ్గురు లేడీస్ కూడా!
X

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో ఫన్నీ అలాగే భయంకరమైన వీడియోలు కూడా ఉంటాయి. అయితే తాజాగా.. ఓ వ్యక్తి ముగ్గురు మహిళలను..

బైక్ పై ఎక్కించుకుని వెళ్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ... రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో.. ఈ వీడియో చెక్కర్లు కొడుతోంది.

హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ పైన.. ఇద్దరు సులభంగా కూర్చోవచ్చు. డ్రైవింగ్ చేసే వ్యక్తితో పాటు మరొకరు కూర్చుంటే చాలా సేఫ్టీగా వెళ్లిపోవచ్చు. కానీ ఈ వీడియోలో చూపించినట్లు.. నలుగురు వెళ్తే ప్రమాదమే. కానీ డ్రైవింగ్ చేసే వ్యక్తి.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ ఏకంగా ముగ్గురు మహిళలను బైక్ పైన ఎక్కించుకున్నాడు. ఇద్దరు మహిళలు వెనకాల కూర్చోగా.. హైండిల్ పైన మరొకరిని కూర్చోబెట్టాడు.

వాస్తవానికి చిన్న పిల్లాడు ముందు కూర్చుంటేనే హ్యాండిల్ తిరగదు. కానీ ఇతగాడు.. ఏకంగా ఆంటీనే ముందు కూర్చోబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలా ముందు కూడా కూర్చుంటే హ్యాండిల్ ఎలా తిప్పుతావ్ బ్రో అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది.. ముగ్గురు లేడీస్ ఒకే రంగు చీర కట్టుకున్నారని సెటైర్లు పేల్చుతున్నారు. ఇక ఇలా డ్రైవింగ్ చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మరి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story