Manchu family : విష్ణు ల్యాండింగ్.. ఫామ్ హౌజ్ నుంచి మనోజ్ ఔట్

Manchu family : విష్ణు ల్యాండింగ్.. ఫామ్ హౌజ్ నుంచి మనోజ్ ఔట్
X

మంచు వారి కుటుంబంలో రచ్చ కొనసాగుతోంది. మోహన్ బాబుకు చెందిన జల్ పల్లి ఫామ్ హౌజ్ నుంచి మంచు మనోజ్‌ వర్గీయులను బలవంతంగా పంపించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో.. మంచు మనోజ్ బౌన్సర్లు, మంచు విష్ణు బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో మంచు మనోజ్ బౌన్సర్లను, మనుషులను విష్ణు బౌన్సర్లు, మనుషులు బయటకు పంపించినట్టు సమాచారం. ఎప్పటికప్పుడు మంచు మనోజ్ భార్య మౌనిక ఈ ఇష్యూను వీడియో కాల్స్ తో మానిటర్ చేసినట్టు సమాచారం. మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదంపై సన్నిహితుల సమక్షంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ మధ్య జల్‌పల్లిలోని నివాసంలో చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం పెద్దల సమక్షంలో ఓసారి చర్చలు జరిగాయి. విదేశాల నుంచి విష్ణు తిరిగి రావడంతో ముగ్గురూ కలిసి చర్చలు జరిపినట్లు టాక్‌ నడుస్తోంది. చర్చల అనంతరం అక్కడి నుంచి మనోజ్‌ వెళ్లిపోయారు.

Tags

Next Story