Nityananda: కైలాస దేశానికి ప్రధానిగా నటి రంజిత కానుందా..
కైలాస దేశానికి నిత్యానంద స్వామి ప్రియ శిష్యురాలే ప్రధాని అయ్యిందా ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది. దేశం నుంచి పరారైన వివాదాస్పద స్వామి నిత్యానంద కైలాస దేశాన్ని ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. ఆ దేశానికి ఆయనే సర్వాధిపతి.తాజాగా నిత్యానంద తన ప్రియ శిష్యురాలు నటి రంజితను కైలాస దేశానికి ప్రధానిగా ప్రకటించుకున్నట్లు ఓ ప్రముఖ తమిళ పత్రిక కథనం ప్రచురించింది. ఈ మేరకు నిత్యానంద వెబ్‌సైట్‌లోనూ ప్రకటించారని పేర్కొనడం కలకలం రేపుతోంది.ఈ వెబ్‌సైట్‌లో రంజిత ఫోటో దిగువన నిత్యానందమయి స్వామి అనే పేరుందని, దాని కిందనే హిందువుల కోసమే ఏర్పాటైన కేలాసదేశ ప్రధానిగా పేర్కొని ఉందని వివరించింది.
కైలాస దేశం పక్కా హిందూ దేశం అని ప్రకటించిన నిత్యానంద ఆ దేశానికి ఓ పతాకం,కరెన్సీ,రాజ్యాంగం వగైరా వగైరా ఓ దేశానికి ఏమేం ఉండాలో అవన్నీ సమకూర్చుకున్నారు.ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశంలో కైలాస దేశం తరపున మహిళా రాయబారులు పాల్గొని ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.ఇకపై నటి రంజిత కూడా కైలాస దేశ ప్రధానిగా ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరవుతారేమో అంటూ కామెంట్లు విన్పిస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com