Renu Desai : మంచి చూపిస్తే బ్యాన్ చేస్తరా.. రేణూ దేశాయ్ ఫైర్

Renu Desai : మంచి చూపిస్తే బ్యాన్ చేస్తరా.. రేణూ దేశాయ్ ఫైర్
X

సినీ నటి, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. తన ఫొటోలు, వీడియోలు షేర్ చేయడమే కాదు, సామాజిక అంశాలపైనా స్పందిస్తూ ఉంటుంది. తన దృష్టికి వచ్చిన విషయాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంది. తన ఎన్జీఓ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల వివరాలనూ పం చుకుంటుంది. అయితే గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్లో వీధి కుక్కల సంర క్షణ గురించి పోస్టులు పెడుతున్న రేణూ.. తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వైఖరిపై షాకింగ్ పోస్ట్ పెట్టింది. 'మనుషులు డిజప్పాయింట్ చేసే ఏ ఒక్క చాన్స్ ను కూడా వదులుకోరు. ఇన్స్టాలో న్యూడిటీ, పోర్న్ వీడియోలు ఓకే.. కానీ మంచి పనిని షేర్ చేయడం మాత్రం నిషేధించబడింది. మా స్వచ్ఛంద సంస్థ చేసిన నిజమైన మంచి పనులను చూపిస్తే, జనాలు దానిని రిపోర్ట్ చేసి మా ఎన్జీఓ ఖాతాను బ్యాన్ చేయాలని చూస్తున్నరు’రేణూ ఆవేదన వ్యక్తంచేసింది. అంతేకాక తాను పోస్ట్ చేసిన వీడియోలను తొలగించారని పేర్కొంటూ, స్క్రీన్షాట్లు కూడా షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రేణూ చేసిన పని మంచిదేనంటూ, ఇలాంటి కంటెంట్ ను ప్రోత్సహించాల్సిందని కామెంట్లు పెడుతున్నారు.

Tags

Next Story