Uttar Pradesh : టోల్ ప్లాజా వద్ద మహిళ వీరంగం.. ఉద్యోగిపై చేతి వాటం

ఉత్తరప్రదేశ్ హాపూర్‌లోని చిజార్సి టోల్ ప్లాజా వద్ద ఓ మహిళ వీరంగం సృష్టించింది. టోల్ డబ్బులు అడిగిన ఉద్యోగిపై చేయిచేసుకుంది. బూత్‌లోకి వెళ్లి అతనిని కొట్టడం ప్రారంభించడంతో టోల్ కార్మికుడు ఆశ్చర్యపోయాడు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఆ మహిళ బూత్‌లోకి దూసుకెళ్లి ఉద్యోగిని చెంపలపై ఎడాపెడా కొట్టడం కనిపిస్తుంది. ఇతర వాహనదారులు ఆపినా ఆమె రెచ్చిపోవడం వీడియోలో ఉంది. సదరు మహిళ ఘజియాబాద్ నుంచి కారులో వస్తున్నారు. ఆమె కారుకు ఉన్న ఫాస్టాగ్ ఖాతాలో అమౌంట్ లేకపోవడంతో నగదు చెల్లించమని ఉద్యోగి అడిగాడు. కోపం తెచ్చుకున్న మహిళ అతనితో వాదించింది. అనంతరం బూత్‌లోకి ప్రవేశించి ఉద్యోగిపై దాడికి పాల్పడింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com