పాకిస్థాన్‌కు భారత్ ఆహ్వానం

వచ్చే నెలలో జరగనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి ప్రత్యర్థి దేశం పాక్‌ను భారత్ ఆహ్వానించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరగాల్సిన ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి ఇండియా నుంచి ఇన్విటేషన్ అందినట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా తెలిపారు. పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుకు కూడా మనదేశం ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని పాక్ అంగీకరించింది.
షాఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో భారతదేశం, కజకిస్థాన్, చైనా, పాకిస్థాన్, కర్గిజిస్థాన్, రష్యా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, సభ్యదేశాలుగా ఉన్నాయి. గతేడాది ఎస్‌సీఓ సమావేశాలు ఉజ్బెకిస్థాన్‌లోని సమర్ ఖండ్‌లో జరిగాయి. అయితే ఈ ఏడు ఈ ఆర్గనైజేషన్ బాధ్యతను భారత్ తీసుకుంది. దీంతో పాకిస్థాన్‌ను కూడా ఆహ్వానించింది. కాగా 2001లో స్థాపించబడిన ఈ సంస్థలో 2017 బీజింగ్ సమావేశంలో భారత్, పాక్‌లకు శాశ్వత సభ్యత్వ హోదా కల్పించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com